అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా..? ఉహూ అంటావా ప్రత్యేక గీతం ఎంత సంచలనం నమోదు చేసిందో తెలిసిందే. అందుకే తెలుగు సినిమాల్లో ప్రత్యేక గీతాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఉంటుంది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఈ ప్రత్యేక గీతాలతో సినిమాకు ఊపు తేవాలని చూస్తారు దర్శక, నిర్మాతలు. ఇప్పుడు ఎఫ్ 3 చిత్ర యూనిట్ కూడా అదే పని చేసింది. టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న పూజా హెగ్డెతో ప్రత్యేక పార్టీ పాటను తెరకెక్కిస్తోంది. ఈ పాట షూటింగ్ శుక్రవారం నాడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అద్భుతమైన సెట్‌లో షూట్ ప్రారంభించారు.
ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరో, హీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారని సమాచారం. పూజా హెగ్డే చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ పాటను రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రత్యేక పాటలో నర్తించనున్న పూజాతో కూడిన న్యూలుక్ ను విడుదల చేశారు.