తమిళంలో తెరకెక్కి ఘన విజయం సాధించిన ‘వినోదయ సితం ’ సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెరకెక్కించిన యాక్టర్, డైరెక్టర్ సముద్రఖనినే ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో దేవుడి పాత్రలో స్వయంగా సముద్రఖనినే నటించారు. ఈ రీమేక్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ఆ పాత్రను చేస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.