సితార తొలిసారి వెండితెరపై మెరవనుంది. ఇప్పటికే తన తండ్రి పాటలతోపాటు పలు పాటలకు డ్యాన్స్ లు చేస్తూ వీడియోలు షేర్ చేసే సితార ఇప్పుడు ఏకంగా తన తండ్రి సినిమాలో ఆయనతో కలసి డ్యాన్స్ చేసింది. ఆదివారం నాడు విడుదల చేయనున్న పెన్నీ సాంగ్ లో ఆమె కన్పించింది. దీనికి సంబంధించిన ప్రొమోను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణ సంస్థ. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మే12న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెన్నీ పాట ఫుల్ సాంగ్ ఆదివారం నాడు విడుదల చేయనున్నారు.