సందడి సందడిగా పెళ్లి సందడి ట్రైలర్

Update: 2021-09-22 07:43 GMT

Full Viewసందడే సందడి. పెళ్లి సందడి ట్రైలర్ చూస్తే అదే కనిపిస్తుంది . శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ నే ఆయన కొడుక్కి కూడా పెట్టి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో రాఘవేంద్రరావు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేశ్‌ బాబు విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు మహేశ్‌. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురానున్నారు..పెళ్లి సందడి' సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

Tags:    

Similar News