పెద్ది ట్రైలర్ విడుదల

Update: 2026-05-18 16:07 GMT

Full Viewటాలీవుడ్ లో ఈ వేసవి చాలా చాలా డల్ గా నడిచింది అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు ఏవీ కూడా ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గరకు రాలేదు. పలు కీలక సినిమాలు కూడా ఐపీఎల్ దెబ్బకు వాయిదాలు వేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు రకరకాల కారణాలతో వెనక్కి తగ్గాయి. కాకపోతే ఈ సమ్మర్ సీజన్లో లో రాబోతున్న పెద్ద సినిమా అంటే రామ్ చరణ్ హీరో గా నటించిన పెద్ది మూవీ అనే చెప్పాలి. జూన్ నాలుగున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు ముంబైలో విడుదల చేసింది. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ట్రైలర్ కూడా ఆ అంచనాలను అలా కొనసాగించింది అనే చెప్పాలి.

                                         ఒక్క క్రికెటే కాకుండా ఈ సినిమాలో ఎన్నో గేమ్స్ ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ చెప్పిన డైలాగు మీరు అందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారూ అన్నది హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఇందులో ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా సంకేతాలు ఇచ్చారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో రామ్ చరణ్ పెద్ది లాంటి సినిమాలు అరుదుగా వస్తాయన్నారు. తనకు దక్కిన పెద్ది అలాంటిదే అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ తన రెండవ సినిమాకే అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News