జాన్వీ కపూర్ రోల్ పై పెద్ద ఎత్తున విమర్శలు

Update: 2026-06-06 08:46 GMT

రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 181 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అదే సమయంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. జాన్వీ పాత్ర అంశం సోషల్ మీడియా లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో దర్శకుడు సానా బుచ్చిబాబు ఈ విమర్శలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని తెలిపారు. పెద్ది మూవీ లో జాన్వీ కపూర్ ను అచ్చియమ్మ పాత్రను చూపించిన విధానం కరెక్ట్‌గా లేదని, కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయనే విమర్శలు రావటంతో క్షమాపణలు చెపుతూ ఒక నోట్ విడుదల చేశారు.

                                    ఒక దర్శకుడిగా.. సినిమా అనేది ప్రేక్షకుల్ని అలరించాలి, స్ఫూర్తిని నింపాలి, మంచి జ్ఞాపకంగా మిగలాలి అని ఆలోచిస్తుంటాను. సినిమాతో ఎవరినీ ఇబ్బందికి పెట్టకూడదు. అసౌకర్యానికి కలిగించకూడదు.. అగౌరవ పరచకూడదు. ఇదే ఆలోచన నా మైండ్‌లో ఉంటుంది. అయితే పెద్ది సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌పై కొన్ని విమర్శలు మా దృష్టికి వచ్చాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్నాము. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.కొన్ని సీన్ల విషయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులను గమనించి సంబంధిత సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం.

                                               ప్రేక్షకుల ఆదరణతోనే సినిమా ముందుకు వెళ్తుంది అని పేర్కొన్నారు. ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాసుకోవలసిన బాధ్యత తమపై ఉంది అని , కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలి. ప్రతి మహిళాలకు గౌరవం ఇవ్వాలి. అందుకు వారు అర్హులు. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. ‘పెద్ది’ విషయంలో తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా, నిజాయతీగా చెప్పిన అందరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు అన్నారు.

Full View

Tags:    

Similar News