పెద్ది విడుదల మళ్ళీ వాయిదా

Update: 2026-04-15 12:42 GMT

రామ్ చరణ్ కు ఫ్యాన్స్ షాక్ . ఆయన హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా విడుదల మరో సారి వాయిదా పడింది. ఈ సినిమా ఏప్రిల్ 30 న విడుదల చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. కానీ ఎప్పటి నుంచో ఈ సినిమా విడుదల మరో సారి వాయిదా పడటం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం నాడు అధికారికంగా సినిమా విడుదల వాయిదా విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ 30 న విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ కు వాయిదా పడింది. అయితే జూన్ లో ఏ తేదీన విడుదల చేస్తామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

                              Full Viewదర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పాటలు, గ్లింప్స్ లు పలు రికార్డు లు నమోదు చేశాయి. ఒక సాంగ్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని పోస్ట్ ప్రొడక్షన్, టాకీ పార్ట్ పూర్తయ్యింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటివరకు ఎడిటింగ్ చేసిన సినిమా చూశామని...అవుట్ ఫుట్ ఎంతో చూసి హ్యాపీగా కూడా ఉన్నామని తెలిపారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 27 న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. మార్చి నుంచి ఏప్రిల్ కు...ఏప్రిల్ నుంచి ఇప్పుడు జూన్ కు ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

Tags:    

Similar News