రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పెద్ది రికార్డు నమోదు చేసింది. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 292. 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. రామ్ చరణ్ సోలో హీరోగా చేసిన మూవీ లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పెద్ది నిల్చింది. ఫస్ట్ వీక్ పూర్తి అయ్యే నాటికే ఈ మూవీ వసూళ్లు మరింత పెరగటం ఖాయం. సోమవారం నాడు బుకింగ్స్ ఒకింత తగ్గినా కూడా మరికొన్ని రోజులు ఈ పెద్ది మూవీ జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. . మరో వైపు ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది. మరో వైపు హీరోయిన్ జాన్వీ కపూర్ విషయంలో తలెత్తిన వివాదం కూడా ఈ సినిమా కు కలిసి వస్తోంది అనే ప్రచారం ఉంది.