Full ViewFull Viewపవన్ కళ్యాణ్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. బీమ్లా నాయక్ సినిమా షూటింగ్ బ్రేక్ టైమ్ లో ఓ గన్ తీసుకుని లక్ష్యాన్ని గురిచూస్తూ వరస పెట్టి కాల్పులు జరుపుతారు. కారుపై ఓ కాలుపెట్టి పవన్ కళ్యాణ్కా ల్పులు జరిగే సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ ను చిత్ర యూనిట్ విడుదల శనివారం నాడు చేసింది. బ్రేక్ టైమ్ లో బీమ్లా నాయక్ స్టైల్ అంటూ పేర్కొంది. ఇందులో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో కన్పిస్తారు.
మళయాళంలో విజయవంతం అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానాలు నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్యారాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.