రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తొలి సినిమా 'వకీల్ సాబ్'. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ సంక్రాంతి రోజున విడుదల చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. వకీల్ సాబ్ టీజర్ లో పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ ను చూపించారు.
'కోర్టులో వాదించటమూ తెలుసు...కోటు తీసి కొట్టడమూ తెలుసు' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా ఉంది. మెట్రోరైలులో ఈ ఫైట్ చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చేలా టీజర్ కట్ చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేకే ఈ వకీల్ సాబ్.