టాలీవుడ్ చరిత్రలో విపరీతంగా జాప్యం జరిగిన సినిమాలు...విడుదల విషయంలో పలు మార్లు వాయిదా పడ్డ సినిమా సినిమాలు పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన హరి హర వీర మల్లు సినిమా విపరీత జాప్యం కావటంతో పాటు పలు మార్లు విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా కూడా హరి హర వీర మల్లు సినిమా సంవత్సరాలకు సంవత్సరాలు జాప్యం జరిగింది. మరో వైపు అసలు ఈ ప్రాజెక్ట్ ను తెర మీదకు తెచ్చిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్ కూడా పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా బాధ్యతలను నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఏ ఎం జ్యోతి కృష్ణ తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రతికూల అంశాల మధ్య ఎట్టకేలకు హరి హర వీర మల్లు సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ..ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల అయిన ఫస్ట్ సినిమా కావటంతో ఈ మూవీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అయన ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానుల్లో కూడా ఏర్పడింది.
అయితే ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ వాయిదాల మీద వాయిదా పడ్డ సినిమా లు హిట్ కావు అనే రూల్ ను మార్చారు అనే చెప్పాలి. ఈ సినిమా రాజకీయాలకు సంబంధించింది కాదు అని పవన్ కళ్యాణ్ చెప్పిన కూడా ఇందులో ఆయన ప్రస్తుతం పదే పదే చెపుతున్న సనాతన ధర్మం తో పాటు కొన్ని పొలిటికల్ డైలాగులను కూడా జొప్పించారు ఇందులో. పాలించే వాళ్ళ పాదాలే కాదు..తల కూడా కూడా కనిపించాలి. జనం మెచ్చే వాడే సైనికుడు అవుతాడు..జన సైనికుడు అవుతాడు వంటి డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా కథ అంతా ఔరంగ జేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రం తీసుకురావటానికి హరి హర వీర మల్లు అసలు ఢిల్లీ ఎందుకు వెళతాడు...మరి అది సాదించాడా లేదా అన్నదే ఈ మూవీ. దీనికంటే ముందు కూడా దేశంలో దొరికే వజ్రాలు..ఇతర ఆభరణాలను అతి తక్కువ ధరకు తెల్లదొరలు తీసుకువెళుతుంటే హరి హర వీర మల్లు అడ్డుకుని వాటిని ఏమి చేశాడు అన్న అంశం చుట్టూనే కథ తిరుగుతుంది. ప్రధానంగా మొఘలుల కాలంలో హిందువులు ఎదుర్కొన్న సమస్యలు, దేవాలయాలపై దాడులు...మత మార్పిడులు వంటి అంశాలు ఇందులో చూపించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఎం ఎం కీరవాణి ఒక రేంజ్ లో నిలబెట్టారు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో కు కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హరి హర వీర మల్లు సినిమా ను నిలబెట్టింది. హరి హర వీర మల్లు టైటిల్ రోల్ లో పవన్ కళ్యాణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయాగా...ఔరంగ జేబు గా బాబీ డియోల్ కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర పరిమితం అయిన కూడా పాటలు...గ్లామర్ షో తో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ గత సినిమాలు అన్ని కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలే. ఈ సారి మాత్రం పీరియాడిక్ డ్రామా సినిమా చేసి ఒకింత సాహసం చేశాడు అనే చెప్పాలి. అయితే క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. కాకపోతే రెండవ భాగం కోసం సినిమా ను మంచి జోష్ లో ఉన్న సమయంలో ఎండ్ కార్డు పడుతుంది. హరి హర వీర మల్లు ఫలితం పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లకు కూడా ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హరి హర వీర మల్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ హిట్ కొట్టి ...విపరీత జాప్యం జరిగిన సినిమా ఖచ్చితంగా ఫట్ అంటుంది అనే అంచనాలను మార్చేశారు అనే చెప్పాలి.
రేటింగ్ : 2 .75 /5