ఉదయపూర్ చేరుకున్న పవన్ కళ్యాణ్

Update: 2020-12-08 12:35 GMT
ఉదయపూర్ చేరుకున్న పవన్ కళ్యాణ్
  • whatsapp icon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయ్ పూర్ చేరుకున్నారు. తన అన్న నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్ళారు. బుధవారం నాడే నిహారిక, చైతన్యల వివాహాం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా ప్యామిలీ అంతా ఉదయ్ పూర్ చేరుకుని పెళ్లి వేడుకల్లో బిజీబిజీగా ఉంది.

సోమవారం నాడు నివర్ తుఫాను బాధితులకు సాయం అందించాలంటూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు హైదరాబాద్ లో బిజెపి ప్రముఖులతో సమావేశం అయి పలు అంశాలపై చర్చించిన తర్వాత ఆయన పెళ్ళి కోసం ఉదయ్ పూర్ బయలుదేరి వెళ్లారు.

Tags:    

Similar News