బీమ్లా నాయక్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూట్ గ్యాప్ లో ఇద్దరూ రిలాక్స్ అవుతున్న ఫోటోనే ఇది. పవన్ కళ్యాణ్ మంచంపై సేదతీరుతుంటే..రానా బండిపై పడుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోను క్లిక్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటోంది.
పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. నిత్యా మెయిన్ హీరోయిన్‌గా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.