ఓజి డేట్ వచ్చేసింది

Update: 2024-02-06 11:54 GMT

Full Viewపవన్ కళ్యాణ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దే కాల్ హిమ్ ఓజి మూవీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. డీవివి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

                                        ఎందుకంటే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ కనిపించనుంది. బ్రో తర్వాత విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇదే. పవన్ కళ్యాణ్ ఓజి తో పాటు హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News