పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఓజీ. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. అదే సమయంలో హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కూడా ఇద్దరూ ఈ మూవీ ఫలితంపై ఫుల్ హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 308 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఓజీ విజయంపై ఫుల్ హ్యాపీ గా ఉన్న పవన్ కళ్యాణ్ తన దర్శకుడు సుజీత్ కు ఒక కాస్ట్ లీ గిఫ్ట్ అందించారు. అదే ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు. పవన్ కళ్యాణ్ తనకు కారు అందిస్తున్న ఫోటోలను సుజీత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవటంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానిని అయిన తాను ఆయన సినిమా ను డైరెక్ట్ చేసి...ఆయన నుంచి కారు బహుమతిగా అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ లేటెస్ట్ ఫోటో ల్లో పవన్ కళ్యాణ్ లుక్ డిఫెరెంట్ గా ఉంది.