వైష్ణ‌వ్ తేజ్ 'కొండ‌పొలం'

Update: 2021-08-20 06:00 GMT

Full Viewతొలి సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు ఈ హీరో. ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో అంద‌రూ చూశారు. ఇప్పుడు అదే వైష్ణ‌వ్ తేజ్..ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ తో క‌ల‌సి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా క్రేజ్ ఓ రేంజ్ లో రాబోతుంది. అందుకు త‌గ్గ‌ట్లు ఈ సినిమాకు వెరైటీగా 'కొండ‌పొలం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తోపాటు ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శుక్ర‌వారం నాడు విడుద‌ల చేసింది.

ఈ సినిమాలో వైష్ణ‌వ్ తేజ్ కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. నాజ‌ర్, కోట శ్రీనివాస‌రావులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అక్టోబ‌ర్ 8న సినిమా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓబుల‌మ్మ‌గా క‌న్పించ‌నుంది. ఎం ఎం కీర‌వాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News