Full Viewగోపీచంద్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. కరోనా కరుణిస్తే మే 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ ను కూడా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ పాటను దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.