టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణది ఒక విలక్షణ స్టైల్. నా దారి రహదారి అంటూ రజనీకాంత్ ఒక సినిమాలో డైలాగు చెప్పినట్లు బాలకృష్ణ కూడా ఎన్ని విమర్శలు ఉన్నా తన దారిలో తాను ముందుకు పోతూనే ఉంటారు. మరో వైపు యువ హీరో లు హిట్స్ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఈ సీనియర్ హీరో వరసగా హిట్స్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఉహించని సర్ప్రైజ్ వచ్చింది అనే చెప్పాలి. అది ఏంటి అంటే దేశ చలన చిత్ర పరిశ్రమలోకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ పేరు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చేరింది.
ఈ విషయాన్నివరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ అధికారికంగా వెల్లడించింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అనే భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆగస్ట్ 30 న హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ ను సన్మానించనున్నారు. 1974 లో తాతమ్మ కల సినిమాతోటి పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. కొద్ది నెలల క్రితమే బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఆడించిన సంగతి తెలిసిందే. తాజా పురస్కారంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు..ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అనే చెప్పాలి.