
అఖండ. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అంటే ఓ క్రేజ్ వేరు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఇందులో సినిమా అంశంతో క్యాన్సర్ పేషంట్లకు విశేష సేవలు అందిస్తున్న బసవతారకం ఆస్పత్రికి సంబంధించి పలు సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు , ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు తమ వంతు అండగా నిలిచారు.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచితులైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని బాలకృష్ణకి అందజేశారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర ఒక లక్ష రూపాయులు మొత్తం ఎనిమిది లక్షలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి విరాళం గా అందించారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా బసవతారకం ఆస్పత్రికి విరాళాలు అందించటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. అఖండ సినిమా ఓవర్సీస్ 500 థియేటర్స్ లో విడుదల కానుంది. బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.