ఏ మాత్రం అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్న మూవీ మా ఇంటి బంగారం. సమంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సమంత లీడ్ రోల్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కగా...దీనిపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని స్వయంగా సమంత వెల్లడించారు. అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా వచ్చింది అని...దీంతో తమ నమ్మకమే నిజం అయింది సమంత వెల్లడించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.