విజయదేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయకు జోడీగా బాలీవుడ్ భామ అనన్యపాండే నటిస్తోంది. తాజాగా ఈ రౌడీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పెద్ద కాఫీ కప్పుతో కూర్చుని...వన్ లాస్ట్ కాఫీ అంటూ పోస్ట్ పెట్టారు. అదే ఇది. షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో ఇటీవల సొంతంగా ప్రారంభించిన ఏవీడీ సినిమాస్ ప్రారంభోత్సవానికి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.