Full Viewశర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమానే ఒకే ఒక జీవితం. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా ద్వారా శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతూ వర్మహీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు కనిపించనున్నారు.
అక్కినేని అమల కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం అటూ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ఇటూ యూత్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.