పవన్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే!

Update: 2025-10-18 08:05 GMT

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఓజీ. విడుదల అయిన పదకొండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 308 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. తర్వాత ఈ మొత్తం మరింత పెరిగినా..అధికారికంగా మాత్రం లెక్కలు బయటకు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు 2025 సంవత్సరంలో టాలీవుడ్ నుంచి అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీ గా కూడా ఓజీ నిలిచింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించటం..దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించటంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగానే ఫస్ట్ డే దుమ్మురేపింది. తోలి రోజు ఈ సినిమా 154 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓజీ లో ఎక్కువగా ఫ్యాన్స్ కు నచ్చే అంశాలే ఉండటం... ఏ సర్టిఫికెట్ కూడా ఒకింత ప్రభావం చూపించింది అని చెప్పాలి.

                                             సుజీత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం ఆయన ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి మరో వైపు వీటికి తోడు థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ జోష్ ను మరింత పెంచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్న ఓజీ మూవీ ఓటిటి డేట్ అధికారికంగా వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది అని తెలిపారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఓజీ లో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News