ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Update: 2025-09-27 11:51 GMT

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దేవర 2 కోసం సిద్ధంగా ఉండాలి అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక పోస్ట్ పెట్టింది. దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ దేవర 2 కోసం సిద్ధంగా ఉండాలని చెప్పటంతో త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే ఏడాది జూన్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నీల్....ఎన్టీఆర్ మూవీ పనులు పూర్తి అయిన తర్వాత దేవర 2 షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.

                                     దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లు ఏమి చేయటం కూడా లేదు. దేవర కంటే దేవర 2 మరింత ఆకట్టుకునేలా ఉంటుంది అని కొరటాల శివ గతంలోనే వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఎన్టీఆర్ మరో మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మానించనుంది. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ తొలిసారి ఒక పౌరాణిక సినిమాలో నటించబోతున్నట్లు చెపుతున్నారు.

Tags:    

Similar News