ఎన్టీఆర్ కొత్త సినిమాలపై క్లారిటీ

Update: 2023-05-20 12:13 GMT

Full Viewకొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుంది. దానికి ఒక నెల ముందు అంటే 2024 మార్చిలోనే ఎన్టీఆర్ 31 వ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. కెజీఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ పేరు దేశమంతటా మారుమోగిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో సాలార్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 వ సినిమా స్టార్ట్ కాబోతోంది. మరో కీలక విషయం ఏమిటి అంటే గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వార్ 2 సినిమా లో ఎన్టీఆర్ నటించబోతున్న విషయం స్పష్టం అయింది.

బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకంక్షాలు చెపుతూ నీ కోసం యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నా..నన్ను కలిసే వరకు నీ రోజులన్నీ సంతోషం, ప్రశాంతతో ఉండాలని కోరుకుంటున్నా.. పుట్టిన రోజు శుభాకాక్షలు మిత్రమా అంటూ తెలుగు లో ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించారు. జరగబోయే దానిగురించి ఆలోచిస్తూ మీరు కూడా మంచిగా విశ్రాంతి తీసుకోండి. మంచి విశ్రాంతి తో మిమ్మల్ని యుద్ధ భూమిలో చూడాలి అనుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకతంలో తెరకెక్కనున్న వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నట్లు అయింది. వరస వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  

Tags:    

Similar News