అంతా రెడీ

Update: 2024-05-20 06:28 GMT

Full Viewసంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్ట్ నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కొద్దిరోజులుగా ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అంటూ సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ ఇతర విషయాలు ఏమి వెల్లడించకుండా ఆగస్ట్ లో సినిమా మొదలుపెట్టనున్నట్లు తెలిపింది.

                                     ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై అటు ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ గత సినిమాలే. వీళ్లిద్దరు కలిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టినమ్మకంతో ఉన్నారు. మరో వైపు ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా తో పాటు బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News