ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేవర సినిమా ఫస్ట్ పార్ట్ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా భారతీయ సినీ చరిత్రలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయటం ఖాయం అని తెలిపారు. ఇప్పటికే దేవర సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ బుధవారం నాడు వెల్లడించగా..ఇప్పుడు మరో కొత్త సినిమా అప్డేట్ రావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు అనే చెప్పాలి. వీటితో పాటు ఎన్టీఆర్ పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ ల్లో కూడా నటించనున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.