వార్ 2 టీజర్ వచ్చేసింది

Update: 2025-05-20 06:52 GMT

హీరో ల పుట్టిన రోజులకు వాళ్ళ వాళ్ళ కొత్త సినిమాల అప్ డేట్స్ ఇవ్వటమే మాములే . టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఇప్పుడు పలు కీలక ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి బాలీవుడ్ మూవీ వార్ 2 అయితే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ మరొకటి. వార్ 2 లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు కోవటంతో వార్ 2 చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ డైలాగు ఇందులో హై లైట్ అని చెప్పొచ్చు.

                                                 

హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ ఇద్దరు పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. ఆగస్ట్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు తో పాటు తమిళ భాషల్లో ఇది విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. వార్ 2 టీజర్ విడుదల ఉండటంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్ డేట్ ను వాయిదా వేశారు. వాస్తవానికి ఇది కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 న గ్లింప్స్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో తేదీన దీన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.

Tags:    

Similar News