ఎన్టీఆర్..ప్ర‌శాంత్ నీల్ సినిమా ప్ర‌క‌ట‌న‌

Update: 2022-05-20 07:02 GMT

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మ‌రో గుడ్ న్యూస్. ఇప్ప‌టికే కొర‌టాల శివ సినిమా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గా..ఇప్పుడు మ‌రో కొత్త సినిమా అప్ డేట్ వ‌చ్చింది. కెజీఎప్2 సినిమాతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు అంద‌రినీ ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ నీల్ తో క‌ల‌సి ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ శుక్ర‌వారం నాడు విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా దీన్ని విడుద‌ల చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే ప్ర‌శాంత్ నీల్ తారక్ ను కూడా ఏదైనా బొగ్గు బావుల్లోకి దింపుతున్నారా అన్న అనుమానం వ‌చ్చేలా ఉంది. కెజీఎఫ్ రెండు భాగాలు కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేంద్రంగా సాగిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News