నితిన్ మ్యాస్ట్రో షూటింగ్ పూర్తి

Update: 2021-06-20 12:36 GMT

తెలంగాణ‌లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయ‌టంతో టాలీవుడ్ ఆగిపోయిన పనుల‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడిప్పుడే చిత్ర యూనిట్లు అన్నీ షూటింగ్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'మాస్ట్రో' షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన అంధాదున్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్‌కు జోడీగా నభా నటేష్‌ నటిస్తున్నారు.

తమన్నా నెగిటివ్‌ షేడ్‌లో కనిపించనుంది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలె మొదలైంది. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితిన్‌ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముగిసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. అతి త్వరలోనే ఈ మూవీని రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. 

Tags:    

Similar News