రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిహారిక పెళ్లి వేడుకలు జోష్ లో సాగుతున్నాయి. ఆటపాటలతో మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తోంది. ప్రత్యేక విమానాల్లో అందరూ సోమవారం నాడే అక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు పెళ్ళి వేడుక జరగనుంది. ఉదయపూర్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సాగుతున్నాయి. ఒక్క పవన్ కల్యాణ్ మినహా మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్థాన్ చేరుకున్నారు.
పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్థాన్లో సంగీత్ వేడుక నిర్వహించారు. నిహారిక, చైతన్యతో కలిసి మెగాస్టార్ పాటకు డ్యాన్స్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఈ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.