వైభవంగా నిహారిక, చైతన్యల వివాహం

Update: 2020-12-09 15:28 GMT

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో బుధవారం రాత్రి నిహారిక వివాహం వేడుకగా జరిగింది. మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరైన ఈ వేడుక అట్టహాసంగా సాగింది. చైతన్య జొన్నలగడ్డ, నిహారిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చ ల్ చేస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు నిహారిక తండ్రి ఓ ఫోటోను షేర్ చేస్తూ తన కుమార్తె గురించి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

'తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది'' అంటూ పేర్కొన్నారు. కూతురిని అత్తారింటికి సాగనంపే సమయం ఆసన్నం కావడంతో పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు.

Tags:    

Similar News