ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ క‌ష్టాలు...రోలింగ్ లేన‌ప్పుడు స్క్రోలింగ్

Update: 2022-03-01 13:38 GMT

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేద్దామ‌నుకుని ప్ర‌మోష‌న్లు అన్నీ అప్పుడే పూర్తి చేశారు. కానీ ఊహించ‌ని స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ తో ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్ర‌చారాన్ని పీక్ కు తీసుకెళ్లినా త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల్లో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది. చిత్ర యూనిట్ త‌ర్వాత రెండు విడుద‌ల తేదీల‌ను తెర‌పైకి తెచ్చింది. అందులో ఒకటి మార్చి 18 లేదా ఏప్రిల్ 28 అని ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ఇందులోనూ మార్పులు చేసి మార్చి 25న ఫిక్స్ అంటూ కొత్త తేదీని లాక్ చేసింది. ఇప్పుడు మార్చిలోకి ప్ర‌వేశించ‌టంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్ర‌మోష‌న్ కోసం మార్గాలు వెతుకుతోంది. శివ‌రాత్రి సంద‌ర్భంగా అంద‌రూ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కూడా అదే ప‌ని చేసింది. సినిమా షూటింగ్​ గ్యాప్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు ఏమి చేశారో చెబుతూ ఓ ఫోటో​ విడుదల చేసింది.

పచ్చటి గడ్డిపై ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ ఇద్దరూ మ్యాట్​లు వేసుకుని పడుకుని ఉన్నారు. అంతేకాకుండా వారు తమ మొబైల్స్​ చేతిలో పట్టుకొని ఏదో స్క్రోలింగ్​ చేస్తూ క‌న్పిస్తున్నారు. ఈ పోస్టర్​కు 'కెమెరా రోలింగ్​లో లేనప్పుడు స్క్రోలింగ్'​ అని క్యాప్షన్​ ఇచ్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా గురించి చెప్పాల్సింది అంతా చెప్పేశారు. మ‌రి ఈ 25 రోజులు కొత్త కొత్త ఫోటోల‌తో ఎలాంటి అప్ డేట్స్ ఇస్తారో చూడాలి. అయితే మ‌ద్య‌లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో పెట్టి అవ‌స‌ర‌మైన ప్ర‌చారంలో పొందే ప‌నిలో ఉన్నార‌ని. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇంకా సినిమా విడుద‌ల‌కు చాలా స‌మ‌యం ఉండ‌టంతో తిరిగి హైప్ తెచ్చేందుకు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితోపాటు చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నం చేసే ప‌నిలో ఉండ‌బోతోంది.

Tags:    

Similar News