విజయదేవరకొండ కొత్త మూవీ రెడీ

Update: 2025-08-25 12:55 GMT

సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, హీరో విజయదేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కింగ్డమ్, ఈ సినిమాను నిర్మించింది సితార ఎంటర్టైన్మెంట్స్ కావటంతో మొదట ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఎందుకో కానీ నిర్మాత నాగవంశీ లెక్కతప్పింది అనే విషయం ఈ సినిమా విడుదల అయిన తర్వాత బయటపడింది. ఎందుకంటే కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో విజయదేవరకొండ కు మరో సారి ఆయన కోరుకున్న సూపర్ హిట్ దక్కలేదు . జులై 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ మూవీ మిశ్రమ స్పందలకే పరిమితం అయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్ట్ 27 నుంచి కింగ్డమ్ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది అని అధికారికంగా వెల్లడించారు.

                                   ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు నటుడు సత్యదేవ్ మరో కీలక పాత్రలో నటించాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే నటించినా ఈ సినిమా లో ఆమెకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. అసలు ఆమెను ఇందులో ఎందుకు పెట్టారో అన్న చర్చ కూడా విడుదల తర్వాత తెర మీదకు వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీలకంగా మారింది. ఈ సినిమాలో మురుగన్ పాత్రలో కనిపించిన వెంకిటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కింగ్డమ్ స్టోరీ గతంలో ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో ఇది పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. 

Tags:    

Similar News