టాలీవుడ్ మోడరన్ మాస్టర్స్

Update: 2024-07-06 10:05 GMT

Full Viewఇండియన్ సినిమా రేంజ్ పెంచిన దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు అన్ని ఇక్కడ మాత్రమే ఆడేవి. కానీ తెలుగు సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లింది రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి రెండు పార్టులతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా ను అంతర్జాతీయ స్థాయి కి తీసుకెళ్లాడు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి రాజమౌళి మీద ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తెరకెక్కించింది.

                                                       మోడరన్ మాస్టర్స్ తో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ రెండు నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రాజమౌళి తన ఇరవై మూడు సంవత్సరాల సినీ కెరీర్‌లో తీసింది 12 చిత్రాలే అయినా ఇప్పటివరకు అపజయం అన్నది ఎరుగని దర్శకుడు ఆయన అనే చెప్పాలి. తెలుగు సినిమాకు ఆస్కార్‌ వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా రాజమౌళిదే అనటంలో కూడా ఏ మాత్రం సందేహం లేదు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే పనిలో ఉన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News