నందమూరి బాలకృష్ణ ఒక వైపు అఖండ 2 తాండవం సినిమా పనుల్లో బిజీ గా ఉంటూనే మరో కొత్త సినిమాకు రెడీ అయిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఎన్ బీకె 111 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఒక స్పెషల్ వీడియో ను విడుదల చేసింది. గతంలో కూడా నందమూరి బాలకృష్ణ, నయనతారలు కలిసి పలు సినిమాల్లో నటించారు.
ఇప్పుడు మరో సారి జోడి కడుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు...ముహుర్తపు షాట్ నవంబర్ 26 న జరగనుంది. వృద్ధ్ది సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శ్రీ రామ రాజ్యం తో పాటు సింహా, జై సింహ సినిమా లో కూడా బాలకృష్ణకు జోడిగా నయనతార నటించింది. దీంతో ఇప్పుడు బాలకృష్ణ తో నయనతార నాల్గవ సారి జోడి కడుతున్నట్లు అయింది.