మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది. హేమా చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమపై చర్యలకు క్రమశిక్షణ సంఘానికి సిఫారసు చేస్తామని..దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. తాము కూర్చుని డబ్బు ఖర్చు పెట్టడం లేదని, తమకున్న ఇమేజ్‌తో ఫండ్ తెచ్చుకున్నామని నరేశ్ స్పష్టం చేశారు. ఈ టర్మ్‌లో కోటి రూపాయల ఫండ్ సమకుర్చామని తెలిపారు.
కరోనా దృష్యా ఎన్నికలు ఎపుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మా ఎన్నికల నేపథ్యలో హేమ మాట్లాడుతూ.. నరేశ్ అసలు ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని పావులు కదుపుతున్నారన్నారు. ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతున్నారని, తాము ఫండ్ రైజ్ చేసి ఇస్తే.. నరేశ్ ఖర్చు పెడుతున్నారంటూ ఆరోపించిన సంగతి విదితమే.