భారీ అంచనాల మధ్య విడుదల అయిన ప్యారడైజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నాని హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 173 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ పై తొలుత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి ప్రధాన కారణం సినిమాలోని పాటలు...శ్రీకాంత్, నాని కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ కూడా. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం ప్యారడైజ్ మూవీ విషయంలో మిశ్రమ స్పందనలే వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలను దర్శకుడు ఒక కొత్త హై కి తీసుకెళ్లాడు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు.
Full Viewఈ సినిమాలో కాస్తో కూస్తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసింది అంటే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తరహా పాత్ర పోషించిన ప్రియదర్శి రోల్ వచ్చినప్పుడే. మరో వైపు హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు ఈ మూవీలో. ప్యారడైజ్ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. అక్టోబర్ 22 నుంచి ప్యారడైజ్ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ మూవీ నిడివి దగ్గర మూడు గంతలు ఉంటే...ఇప్పుడు ఓటిటి లో మాత్రం దీన్ని రెండున్నర గంటలకు తగ్గించారు. విపరీతంగా ఉన్న హింసాత్మక సన్నివేశాలతో పాటు మూవీకి బ్రేక్ లు వేసిన సన్నివేశాలను కూడా కట్ చేసినట్లు చెపుతున్నారు.