సెప్టెంబర్ లో విడుదల !

Update: 2026-07-14 14:24 GMT

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ హైప్ ఉన్నసినిమాల్లో ది ప్యారడైజ్ ఒకటి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తర్వాత విడుదల ఆగస్ట్ 21 కి వాయిదా పడింది. ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల మరో సారి వాయిదా పడే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కావటంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో నాని దసరా మూవీ లో కంటే మరింత ఊర మాస్ పాత్రలో చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదల అయిన కంటెంట్ ను చూస్తుంటేనే తెలుస్తోంది.

                           Full View      సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవటంతో సినిమా ప్రచారానికి సరిపడినంత సమయం ఉండదు అనే కారణంతో ఇప్పుడు ఈ మూవీ విడుదలను 2026 సెప్టెంబర్ కు మార్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. సెప్టెంబర్ 25 డేట్ ను కొత్త విడుదల తేదీగా నిర్ణయించినట్లు చెపుతున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో నానికి జోడిగా కయాదు లోహర్, సోనాలి కులకర్ణి లు నటిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News