క్రిస్మస్ సందర్భంగా నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టక్ చేసుకుని చాప మీద కూర్చుని ఉన్న నాని ఆకులో ఫుల్ గా అన్నం, కూరలు పెట్టుకుని కూర్చున్నాడు. అంతే కాదు. సరదాగా ఈ సారి ఫుల్ మీల్స్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ లుక్ ను షేర్ చేశాడు.
ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ లు నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2021 ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ లో రివీల్ చేశారు.