బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Update: 2024-09-06 09:40 GMT

Full Viewనందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపొయింది. ఈ యువ హీరో తొలి సినిమా ను హనుమాన్ సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. కొద్ది రోజుల నుంచి ఆయన ఈ మేరకు హింట్స్ ఇస్తూనే వస్తున్నారు. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. సింబా ఈజ్ కమింగ్ అంటూ సినిమా ప్రకటనతో శుక్రవారం నాడు మోక్షజ్ఞ న్యూ లుక్ ను విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే రెండో సినిమా ఇది.

                         ఇప్పటికే హనుమాన్ తో మంచి విజయాన్ని దక్కించుకున్న ప్రశాంత్ వర్మ మరి ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాతో ఎంతటి విజయాన్ని అందించుకుంటారో వేచిచూడాల్సిందే. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , లెజెండ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. తమ్ముడి సినిమా కు అక్క నందమూరి తేజశ్వని ఒక నిర్మాతగా వ్యవరించనున్నారు. వాస్తవానికి బాలకృష్ణ కు పలు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండే అవకాశం ఉంది అని బలంగా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కు తనయుడి సినిమాను అప్పగించారు బాలకృష్ణ.

Tags:    

Similar News