డాకుమహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్

Update: 2025-01-13 08:41 GMT

నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువ. ఇదే విషయం మరో సారి ప్రూవ్ అయింది. ఈ సంక్రాంతికి డాకుమహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ మరో హిట్ అందుకున్నాడు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జనవరి 12 న విడుదల అయిన డాకుమహారాజ్ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.

                                                              నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. మరో వైపు అమెరికా లో కూడా డాకుమహారాజ్ వన్ మిలియన్ గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన డాకుమహారాజ్ సినిమా కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్ సభను అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి అక్కడే రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉన్నా కూడా తిరుపతిలో చోటు చేసుకున్న విషాద ఘటనతో దీన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News