హీరో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయటానికి ఇష్టపడతారు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా..దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను అన్ని రకాల పాత్రలు చేయటానికి సిద్ధం అని..అయితే ఆ పాత్ర వల్ల తన ఫ్యామిలీపై అది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించకూడదు అని వ్యాఖ్యానించారు. ఏదైనా పాత్ర వల్ల ఫ్యామిలీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటే అలాంటి వాటికి దూరంగా ఉంటానన్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సమంతను ఉద్దేశించే పరోక్షంగా నాగచైతన్య ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్లో సమంత బోల్డ్ యాక్టింగ్ వీరి విడాకులకు ప్రధాన కారణమనే రూమర్స్కి చైతన్య వ్యాఖ్యలతో మరింత బలం చేకూరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రస్తుతం నాగ చైతన్య థ్యాంక్యూ, బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్నాడు.