ప్రచారమే నిజం అయింది. ఎప్పటి నుంచో అక్కినేని నాగ చైతన్య , శోభిత దూళిపాళ్ల రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అందరూ ఇది ప్రచారంగానే భావించారు. కానీ గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియా లో ఒకటే హడావుడి స్టార్ట్ అయింది. నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు ప్రచారం ప్రారంభం అయింది. గురువారం మధ్యాహ్నం అక్కినేని నాగార్జున ట్వీట్ తో ఇది నిజం అన్న విషయం ఖరారు అయింది.
గురువారం ఉదయం 9 .42 నిమిషాలకు హైదరాబాద్ లో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగినట్లు నాగార్జున వెల్లడించారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించటానికి ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ జంట జీవిత కాలం సుఖసంతోషాలతో ఉండాలి అంటూ నాగార్జున విషెస్ తెలిపారు. తొలుత నాగ చైతన్య సమంత ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడటంతో విడాకులు తీసుకున్నారు.