Full Viewవచ్చేసింది. అటు ఎన్టీఆర్..ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాట రానే వచ్చింది. అనుకున్నట్లుగానే ఇందులో ఇద్దరూ హీరోలు దుమ్మురేపారు. వీరి డ్యాన్స్ టాలెంట్ అలాంటిది మరి. నా పాట సూడు..నా పాట సూడు వీర నాటు అంటూ సాగే పాటను రాహుల్ సింప్లిగంజ్, కాలభైరవలు పాడారు. ఈ పాట అంతా ఇద్దరు హీరోల అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేలా సాగింది.
చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా..కీరవాణి మ్యూజిక్ సమకూర్చారు. ఈ పాటలో ఎన్టీఆర్ కు జోడీగా నటించిన హాలీవుడ్ భామ ఒలివియో మోరిస్ కూడా మెరిసింది. రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే.