మిస్టర్ బచ్చన్..డబుల్ ఇస్మార్ట్ లో హిట్ మూవీ ఏది?!

Update: 2024-08-15 15:09 GMT

Full Viewపండగలు...సెలవులు ఉన్నప్పుడు సినిమాల మధ్య పోటీ సహజం. ఈ ఆగస్ట్ 15 కి కూడా అదే జరిగింది. ఫస్ట్ ఈ డేట్ ను హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ లాక్ చేసుకోగా...అనూహ్యంగా దర్శకుడు హరీష్ శంకర్, రవి తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ రేసులోకి వచ్చింది. వాస్తవానికి ఈ డేట్ ను ముందు లాక్ చేసుకున్నది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అన్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా వాయిదా పడటంతో ఈ డేట్ ను అటు హీరో రవి తేజ తో పాటు రామ్ లు ఉపయోగించుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రధాన పోటీ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లే ఉన్నాయి. అయితే పాటలతో పాటు ప్రచారం ద్వారా కూడా డబుల్ ఇస్మార్ట్ తో పోలిస్తే రవి తేజ మిస్టర్ బచ్చన్ సినిమా నే మంచి బజ్..పాజిటివ్ ప్రచారం దక్కించుకోలిగింది అనే చెప్పాలి. ప్రచారం జరగటమే కాదు రెండు సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులు ఎవరైనా తమ మొదటి ఓటు రవి తేజ మిస్టర్ బచ్చన్ కే వేస్తారు అని చెప్పొచ్చు. ఈ సినిమా లో కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా కూడా ఆకట్టుకునే డైలాగులతో సినిమాని నడిపించి దర్శకుడు హరీష్ శంకర్ ఒకింత విజయవంత అయ్యారు. దీనికి తోడు ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా అదనపు ఆకర్షణగా నిలిచారు.

                                                                                           హరీష్ శంకర్ డైలాగులు, సత్య, చమ్మక్ చంద్ర కామెడీ లు మిస్టర్ బచ్చన్ సినిమా బోర్ కొట్టకుండా చేయటంలో కీలక పాత్ర పోషించాయి. మరో సినిమా డబుల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే ప్రేక్షకులపై సింగిల్ ఇంపాక్ట్ చూపించటంలో కూడా విఫలం అయింది. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటంతో ఏ దశలోనూ ఈ మూవీ ప్రేక్షలుకులను ఆకట్టుకోలేక పోయింది. హీరో రామ్ మాస్ లుక్ లో యాక్షన్స్ పరంగా మంచి ప్రయత్నమే చేసినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పాటు ఈ సినిమా లో అలీ పాత్ర తో దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. మిస్టర్ బచ్చన్ తో పోలిస్తే డబుల్ ఇస్మార్ట్ లో పాటలు కూడా ఏ మాత్రం ఆకట్టుకునేవి లేవు. దీంతో బాక్స్ ఆఫీస్ విజేతగా రవి తేజ మిస్టర్ బచ్చన్ నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉన్నంతలో ఎంటర్టైన్ మెంట్ ఉన్న సినిమా ఇదే కాబట్టి. దీనికి తోడు ఆగస్ట్ 15 హాలిడే కలిసి వచ్చేలా సినిమాలు గురువారం నాడే విడుదల కావటంతో లాంగ్ వీకెండ్ కూడా బచ్చన్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News