'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్' ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Update: 2021-09-30 13:00 GMT

Full Viewఅక్కినేని అఖిల్, పూజా హెగ్డెలు న‌టించిన సినిమానే 'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్'. అక్టోబ‌ర్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం విడుద‌ల చేసింది. మ‌న లైఫ్ పార్ట‌న‌ర్ తో క‌నీసం తొమ్మిదివేల రాత్రిళ్ళు క‌ల‌సి ప‌డుకోవాలి అంటూ పూజా హెగ్డె చెప్పే డైలాగ్ తో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. మ‌ధ్య‌లో వెకేష‌న్ల‌కు వెళ్ళాలి. అన్నింటికి మంచి కొన్ని ల‌క్షల క‌బుర్లు చెప్పుకోవాలంటూ చెబుతుంది.

ఒక‌బ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ ప‌ర్సంట్ కెరీర్..ఫిఫ్టీ ప‌ర్సంట్ మ్యారేజ్డ్ లైఫ్‌. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలంటూ అఖిల్ చెప్పే డైలాగ్ ల‌తో ట్రైల‌ర్ సంద‌డి సంద‌డిగా ఉంది. ఇప్పుడు ప్ర‌తి రోజూ వైఫ్ అండ్ హ‌జ్పెండ్ చేయాల్సిన ప‌నేంటి అంటూ అఖిల్ డైలాగ్ తో షాకిస్తారు. ఈ సినిమాలో జాతిర‌త్నాల‌తో అంద‌రి మ‌న‌సు దోచిన ఫ‌రియా అబ్దుల్లా, ఈషారెబ్బాలు కూడా ఉన్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అర‌వింద్, బ‌న్సీ వాసులు నిర్మించారు.

Tags:    

Similar News