అక్కినేని అఖిల్, పూజా హెగ్డె జంటగా నటించిన సినిమా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్'. చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 15న సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీతో న్యూలుక్ ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అల్లు అరవింద్, బన్సీ వాసులు నిర్మించారు. 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమాపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా ఉన్న పూజా హెగ్డె ప్రభావం అయినా అఖిల్ కు కలసి వస్తుందో లేదో వేచిచూడాల్సిందే.