అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షోలో అవినాష్ తో బాగానే ఆడుకుంటున్నాడు. హౌస్ లో అవినాష్ పెళ్లి పెద్ద టాపిక్ అయి కూర్చోంది. ప్రతి సారి ఏదో ఒక రూపంలో ఈ అంశం చర్చకు వస్తూనే ఉంది. ఆదివారం నాడు కూడా నాగార్జున ఇదే అంశంపై అవినాష్ ను బుక్ చేసే ప్రయత్నం చేశాడు. అవినాష్ ను మోనాల్ ముద్దు పెట్టుకుంటే ఎలా చేస్తాడో చేయమని అరియానా ను కోరతాడు నాగార్జున. అరియానా చేసిన యాక్షన్ కు అవినాష్ పదికి ఎనిమిది మార్కులు వేస్తాడు.
అంటే చాలా దగ్గరకు వచ్చేసింది అన్న మాట అని నాగార్జున అనగానే..సర్..నాలాగా నేనే చేస్తాను అనగానే నాగార్జున కూడా సరే చేయమని ఆఫర్ ఇస్తాడు. అంతే అవినాష్ మోనాల్ అని పిలవగానే వచ్చి అవినాష్ చెంపపై ముద్దు పెడుతుంది మోనాల్. అంతే అవినాష్ యాక్షన్ చూడాల్సిందే. ఇది కాగానే అందరూ చూశారు కదా..అవినాష్ కు పిల్లనిచ్చే వాళ్ళు..ఇద్దామనుకునే వాళ్లు అనగానే అవినాష్ సర్..ఈ ఎపిసోడ్ తో హరిహోం తస్సదీయా అంటూ సరదగా నవ్విస్తాడు.