నాగార్జున 'ఆ మోర్ ' ఏంటో క్లారిటీ అడుగుతారా?
'అమ్మాయిలు..అబ్బాయిలు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు. కొంచెం మోర్ కావాలి. కొంచెం మోర్ లేదు కదా?. అదే ప్రాబ్లం' ఇదీ బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ ను అఖిల్ నామినేట్ చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యలు. అభితో దోస్తానాకు కటీఫ్ చెప్పిన తర్వాత మోనాల్, అఖిల్ లు గత కొన్ని రోజులుగా క్లోజ్ ఫ్రెండ్స్ గా మూవ్ అవుతున్నారు. కానీ సడన్ అఖిల్ మోనాల్ ను నామినేట్ చేయటంతో హౌస్ సభ్యులు అందరూ షాక్ కు గురయ్యారు. అందరూ దీనిపైనే చర్చ పెట్టారు. అమ్మ రాజశేఖర్ అయితే మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అఖిల్ ఈ సారి ఫైరింగ్ మోడ్ లోకి వెళ్లి అమ్మ రాజశేఖర్, మోనాల్ ను నామినేట్ చేశాడు. ''ఇంట్లో ఉండటానికి అర్హత ఉండాలి. పోతా పోతా అని మీరే పదిసార్లు అంటుంటారు. కాబట్టి వెళ్లడానికి మీరు రెడీ అయితే పంపించడానికి కూడా నేను రెడీనే" అని మాస్టర్ తలపై గుడ్డు పగలగొట్టాడు. ఆ వెంటనే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మోనాల్‌ను నామినేట్ చేయడం ఇంటిసభ్యులనే కాదు, ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది.
గతంలో ఓ సారి బిగ్ బాస్ జంటలను ఎంపిక చేసి ఎవరు నామినేట్ అవుతారో నిర్ణయించుకోమన్నారు. అప్పుడు అఖిల్, మోనాల్ జంటగా వచ్చారు. మోనాల్ తాను ఎలిమినేషన్ కు రెడీ అని..అఖిల్ ను హౌస్ లో ఉండమని కోరుతుంది. అప్పుడు మోనాల్ పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ ఈ సారి మాత్రం అఖిల్ తీరుతో కుతకుతలాడిపోతోంది. ఇది చూసిన మాస్టర్ 'వాడేంటి మిగతా ఫ్రెండ్స్ ను పక్కనపెట్టి నీమీద వేశాడు' అంటూ రెచ్చగొట్టాడు. 'నువ్వు ఉండే వరకూ నేను నీకు సపోర్ట్ గా ఉంటా 'అని మోనాల్ చేయి పట్టుకుని ధైర్యం చెప్పాడు. నామినేషన్ ప్రక్రియతో అవినాష్, అరియానా, అమ్మ రాజశేఖర్, మోనాల్ ఒక టీమ్‌గా ఏర్పడినట్లు ప్రోమోలో చూపించారు. చూడాలి ఇంకా ఎన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో.